కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ స్థానానికి బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఇప్పటికే వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేసారు. గతంలో జడ్పీటీసీగా పనిచేసిన మహేశ్వర్ రెడ్డి చనిపోవడంతో ఈ ఎన్నిక అనివార్యం అయింది. రెండు ప్రధాన పార్టీలు పోటీలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారింది.