పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తన సొంత నిధులతో ప్రారంభించారు. గత కొంతకాలంగా సీపీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఈ రోడ్డు పనులతో వారికి ఊరట లభించింది. కాంట్రాక్టర్ పనులు చేపడుతుండగా, కాలనీ ప్రజలు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.