వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి, ప్రస్తుత ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గించి ఆంగ్లానికి పెద్దపీట వేస్తోందని ఆదివారం తీవ్రంగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పేరును ఇంగ్లీష్ దేశం లేదా ఆంగ్ల దేశం పార్టీగా మార్చుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన సూచించారు.