పులివెందుల శిల్పారామంలో ఆదివారం చిన్నారులు శాస్త్రీయ, జానపద భక్తి గీతాలకు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. 'ఓం నమశ్శివాయ', 'కాంతార వరహావరూపం' వంటి పాటలకు వారు చేసిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం శిల్పారామం ఏవో విశ్వనాథ్ రెడ్డి పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించబడింది.