పులివెందుల ప్రాంతంలోని అంగన్వాడీ టీచర్లు తమ కనీస వేతనాలు పెంచాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మూడు రోజులుగా ధర్నా చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలిపిన టీచర్లు, కూటమి ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.