పులివెందులలోని శిల్పారామంలో బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శిల్పారామం పరిపాలన అధికారి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు జానపద, శాస్త్రీయ భక్తి గీతాలకు అద్భుతమైన నృత్యాలు ప్రదర్శించారు. వారి ప్రతిభను చూసి ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో సందడి చేశారు. ఈ కార్యక్రమం బక్రీద్ పండుగ స్ఫూర్తిని చాటింది.