గండి క్షేత్రానికి భక్తులు శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేలాది మంది ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, రాజా స్వామి, రఘు స్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఆలయ పాలకమండలి ఛైర్మన్ కావలి కృష్ణ తేజ, సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య తెలిపారు.