ప్రొద్దుటూరు ఎంఈఓలు సావిత్రి, శోభారాణి శుక్రవారం స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ పాఠశాలలో బడి పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, పదో తరగతి పరీక్షల్లో పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి యశ్వంత్ కు ఉపాధ్యాయుడు నాగార్జునరెడ్డి ప్రోత్సాహకంగా రూ. 5వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వారు తెలిపారు.