మాజీ మంత్రి, వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గురువారం ఉదయం 9 గంటలకు వేంపల్లికి రానున్నారు. ఆయన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి స్వగృహంలో బస చేస్తారు. అనంతరం ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాటును చేరుకొని దివంగత నేత వైస్సార్ కి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత వేంపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి విచారణలో పాల్గొంటారని వైఎస్ఆర్సిపి వర్గాలు తెలిపాయి.