రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాలిసెట్-2026 పరీక్షా ఫలితాల్లో సింహాద్రిపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ శివ శంకర్ తెలిపారు. కోచింగ్ తీసుకున్న అభినయ శ్రీ 4721, వెంకట పవిత్ర 5128, నాగ హస్మిత 5321 ర్యాంకులు సాధించారు. ఈ అద్భుత ఫలితాలపై ప్రిన్సిపల్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.