తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఖాజా మోహిద్దీన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను, నివేదికలను పరిశీలించారు, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అన్ని రకాల సేవలు సకాలంలో అందించాలని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని సూచించారు. కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తత కలిగి ఉండాలన్నారు.