పులివెందుల ప్రాంతంలోని గండికోట, పార్నపల్లి రిజర్వర్లలో నీటిని నింపిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలో సర్పంచులకు నిర్వహించిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యత లభించిందని, నిర్వాసితులకు సుమారు రూ. 1000 కోట్ల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించారని తెలిపారు.