లింగాల ఐటీఐలో 3న జాబ్ మేళా

పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లింగాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఆగస్ట్ 3వ తేదీన ఆదివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్న రాణి తెలిపారు. గురువారం ఆమె తెలుపుతూ. ఈ జాబ్ మేళాలో పలు కార్పొరేట్ సంస్థలు పాల్గొంటున్నాయని, ఇప్పటికే ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.

సంబంధిత పోస్ట్