చిత్తూరు జిల్లా వి. కోటలో రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసి రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆయన విమర్శించారు.