సింహాద్రిపురం ఎంఈఓ గా ఖాదర్ భాష

సింహాద్రిపురం మండలం రెగ్యులర్ ఎంఈఓగా ఖాదర్ బాషా గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సింహాద్రిపురం ఎంఈఓగా పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎంఈఓగా పనిచేస్తున్న ఓబులేసు కొండాపురం మండలం ఎంఈఓగా కొనసాగునున్నారు. బాధ్యతలు చేపట్టిన ఎంఈఓ కి ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్