శుక్రవారం లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో పాసు పుస్తకాల పంపిణీ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వైసీపీ నాయకుడు ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, పాస్ పుస్తకాల పంపిణీలో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రశ్నించినందుకే తమపై దాడి చేశారని ఆరోపించారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.