దాడి కేసులో నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్షతోపాటు రూ. 3వేలు జరిమానా విధించినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. లింగాల మండలం తాతిరెడ్డి పల్లెకి చెందిన ఆకుల లక్ష్మీనారాయణపై అదే గ్రామానికి చెందిన వెన్నపూస నారాయణరెడ్డి గత ఏడాది మార్చి 24వ తేదీన హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్పెషల్ జడ్జి ప్రత్యూష కుమారి సాక్ష్యాధారాలను విచారించి, నేరం రుజువు కావడంతో ముద్దాయికి శిక్ష విధించారు.