వ్యవసాయంపై నామోషి వద్దు: జిల్లా కలెక్టర్

జమ్మలమడుగు మండలం పొన్నతోటలో సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి యువతకు వ్యవసాయం చేయడంలో నామోషి ఉండకూడదని సూచించారు. తాను పెద్ద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, ఇంటర్మీడియట్ వరకు సంకోచం లేకుండా వ్యవసాయ పనులు చేశానని తెలిపారు. యువత వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా భావించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్