స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు భాషోద్ధారకుడని, తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ ఎంపీ తులసి రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లెలో ఎన్టీఆర్ 103వ వర్ధంతిని తులసి రెడ్డి దంపతులు ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నిరుపేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించాలనే ధ్యేయంతో ఆయన ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం, పక్కా గృహాల పథకాలు చరిత్రలో నిలిచిపోయాయని తులసి రెడ్డి పేర్కొన్నారు.