పులివెందుల పట్టణంలో గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్, పెట్రోలు కొరత కారణంగా పెట్రోలు బంకులు మూతపడ్డాయి. దీంతో వాహనదారులు పెట్రోలు కోసం బంకుల వద్ద బారులు తీరారు. డీజిల్ లభించకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారు, అత్యవసర సమయాల్లో ప్రయాణించేవారు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి డీజిల్ కొరతను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.