పులివెందుల బ్రాంచ్ కెనాల్ నిర్వహణ అధ్వాన్నంగా మారింది. కాలువల నిర్వహణకు కేటాయించిన నిధులను అధికారులు సక్రమంగా ఉపయోగించకపోవడంతో కాలువల్లో ముళ్లపొదలు పెరిగిపోయాయి. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, వేంపల్లి చివరి ఆయకట్టు వరకు నీరు చేరడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువలను సక్రమంగా నిర్వహించాలని వారు కోరుతున్నారు.