పులివెందులలో గ్యాస్ కోసం రోడ్డుపై నిరసన

పులివెందులలో గ్యాస్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హరిప్రియ గ్యాస్ గోడౌన్ వద్ద శనివారం ఉదయం నుంచే ప్రజలు సిలిండర్ల కోసం క్యూలో నిలబడ్డారు. అయితే, గోడౌన్ వద్ద సిలిండర్లు ఇవ్వబోమని, డోర్ డెలివరీ చేస్తామని ఏజెన్సీ సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీరామ్ అక్కడికి చేరుకుని ఏజెన్సీ వారితో మాట్లాడి, క్యూలో ఉన్న వారికి గ్యాస్ పంపిణీ చేయించారు.

సంబంధిత పోస్ట్