పులివెందుల మండలం ఎర్రబల్లి గ్రామ సమీపంలోని పంచలింగాల కోన శివాలయం వద్ద తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ఏర్పడిన జలపాతం భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటోంది. కొండ, కోనల నుంచి ప్రవహిస్తున్న నీటిలో కేరింతలు కొడుతూ ఆనందం పొందుతున్నారు. కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు ఈ జలపాతాన్ని చూసి మురిసిపోతున్నారు.