పులివెందుల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నగరిగుట్ట, రాజారెడ్డి కాలనీలో డెంగ్యూ మాసోత్సవం మరియు ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం ఫై శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రభావం, నివారణ పద్ధతులు, మరియు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించారు.