పులివెందులలో అప్పు ఇచ్చి తిరిగి అడిగినందుకు వ్యక్తులపై రాళ్ల దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బుధవారం పట్టణంలో రాజా, మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు నాగరాజు, భాస్కర్ అనే వారికి గతంలో అప్పు ఇచ్చినట్లు సమాచారం. అప్పు తిరిగి అడగడంతో నాగరాజు, భాస్కర్ కర్రలతో దాడి చేశారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.