పులివెందుల పట్టణ సమీపంలోని స్థానిక శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఆదివారం అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు శ్రీ రంగనాథ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఆలయం చుట్టూ ఊరేగించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించారు.