పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో స్వామివారి కళ్యాణోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ రంగనాథ స్వామి గరుడ వాహనంపై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని కాయ కర్పూరం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.