పులివెందుల: నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

కడప జిల్లా వ్యాప్తంగా తుపాన్ కారణంగా పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులురెడ్డి, సుబ్బారాయుడు గురువారం పులివెందులలో విలేకరులతో మాట్లాడుతూ కోరారు. జిల్లా వ్యవసాయ యంత్రాంగం నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించి, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు సూచించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అత్యవసర చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్