పులివెందుల: వైభవంగా శ్రీ రంగనాథ స్వామి కళ్యాణం

వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా, పులివెందుల పట్టణంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో బుధవారం భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు కృష్ణరాజేష్ శర్మ శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కళ్యాణాన్ని తిలకించి తరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్