ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థంగా చేరేందుకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకమని డిప్యూటీ ఎంపీడీవో ఉమా మహేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఈ కొత్తపల్లిలోని స్వర్ణ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె, గ్రామంలో ప్రతి కుటుంబం సర్వే పరిధిలోకి రావాలని, ఒక్కరూ మిగలకుండా వివరాలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతిని ఆమె సమీక్షించారు.