చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా పులివెందుల నియోజకవర్గానికి తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు.