చిలంకూరులో పారిశుద్ధ్య పనులు

ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో గురువారం ఎంపీడీవో వెంకటరమణయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ పథం కార్యక్రమం జరిగింది. గ్రామం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు. అనంతరం శానిటరీ సిబ్బందితో కలిసి గ్రామంలోని వీధులు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్