వేంపల్లెలోని వెలసిన శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానంలో (ఎద్దులకొండ) శ్రావణమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ హనుమంతరావు తెలిపారు. ఇందులో భాగంగా జులై 26వ తేది మొదటి శనివారం, ఆగస్టు 2వ తేది రెండవ శనివారం, 9వ తేదీ మూడవ శనివారం, 16వ తేదీ నాలుగో శనివారం, 23 ఐదో శనివారం నిర్వహించనున్నారు. 3 వ శనివారం ఆగస్టు 9న ఎద్దులకొండపై స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.