పులివెందులలో పురాతన శ్రీరంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక పూలంగళ్ల వద్ద ఏర్పాటు చేసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి హనుమ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం హనుమ వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక చింతనను పెంచుతున్నాయి.