పులివెందల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు గౌరీ, ఆయిష్ జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికయ్యారు. కర్ణాటకలోని బెల్గావీలో జరిగిన ఈ శిబిరంలో, వారు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. వివిధ రాష్ట్రాల యువత మధ్య భాషలు, సంస్కృతులు, సంప్రదాయాల అవగాహన పెంపుదలలో తమ ప్రత్యేకతను ప్రదర్శించారు. వీరి ప్రతిభను కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు అభినందించారు.