చక్రాయపేట మండలంలోని చిలేకంపల్లి క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. చిలేకంపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థి ఇర్షద్ పరీక్షకు బైక్ పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన బందలకుంట ఆంజనేయ రెడ్డి వాహనం ఢీకొట్టింది. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ఆంజనేయ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.