తొండూరు మండలంలోని భద్రంపల్లి, లోమడ తోటల్లో 10 బోర్ల వద్ద మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు తెల్లవారుజామున చోరీకి గురయ్యాయి. గుర్తు తెలియని దొంగలు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉదయం రైతులు బోర్ల వద్దకు వెళ్లినప్పుడు వైర్లు కత్తిరించినట్లు గమనించారు. వేల రూపాయల విలువైన కేబుల్ వైర్లు చోరీకి గురికావడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని వాపోయారు.