వేంపల్లెలో వాసవి జయంతి ఉత్సవాలు

వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో వేద మంత్రోచ్చారణతో పంచామృతాభిషేకం, మంత్రపుష్పం, మహా మంగళహారతి వంటి విశేష పూజలు జరిగాయి. సాయంత్రం ఊంజల సేవ, సహస్రదీపాలంకరణ పూజలు కూడా నిర్వహించారు. ఈ ఉత్సవాల వివరాలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్