శ్రీ సత్యసాయి జిల్లా కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఆదివారం రాత్రి ప్రయాణించిన 48 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి వేంపల్లెలో మృతి చెందారు. కదిరిలో బస్సు ఎక్కిన అతను వేంపల్లె వరకు టికెట్ తీసుకున్నాడు. రాత్రి 8 గంటలకు బస్సు వేంపల్లె చేరినప్పుడు కండక్టర్ పిలిచినా స్పందించకపోవడంతో అతను మృతి చెందినట్టు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.