వేంపల్లె మండలంలోని పక్కీరుపల్లె మూగబోయింది. ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. ఊర్లో ఉన్న మగ వారంతా మాయమయ్యారు. ఆడవాళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు వీధుల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఈనెల 7వ తేదీన అమ్మాయి అదృశ్యం కాగా గ్రామస్థులందరూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. పోలీసులు దాదాపు 160 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో తమని ఎక్కడ అరెస్ట్ చేస్తోనని వారంతా గ్రామాన్ని వదిలి వెళ్లారు.