వేంపల్లె మేజర్ పంచాయతీకి చెందిన పక్కీరుపల్లె గ్రామస్థులకు ఇప్పుడు పోలీసుల భయం పట్టుకుంది. ఈ నెల 7న ఒక బాలిక అదృశ్యమైన ఘటనపై అక్కడి వారు ఆందోళన చేసిన నేపథ్యంలో, పోలీస్ స్టేషన్‌పై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఆరోపణలతో 162 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అరెస్టుల భయంతో గ్రామస్థులు ఇళ్లు విడిచి పారిపోతున్నారు.