ఆలస్యంగా నైనా చంద్ర బాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2నుంచి అమలు చేయాలని నిర్ణయించడం హర్షణీయం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమలుపై ఆంక్షలు పెట్టవద్దని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రతి రైతుకు ఏటా రూ 20 వేలు ఆర్థిక సాయం చేస్తామని కూటమి పార్టీలు తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నాయి అన్నారు.