వేముల: పెండ్లూరులో భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

వేముల మండలం పెండ్లూరులో రీసర్వేలో తలెత్తిన భూ సంబంధిత సమస్యలు, పొరపాట్లను సరిదిద్దిన అనంతరం రైతులకు నూతన భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ శుక్రవారం జరిగింది. తహసీల్దార్ రెడ్డి లక్ష్మీ మాట్లాడుతూ, మంజూరైన పాత పాసు పుస్తకాల స్థానంలో తప్పులు లేకుండా కొత్తవి జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త పాసు పుస్తకాలతో రైతులకు భూ రికార్డుల సమస్యలు తొలగి, భవిష్యత్తులో భూ లావాదేవీలకు ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్