పది పరీక్ష ఫలితాల్లో చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లె (సురభి) జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కోలా లక్ష్మీ వెంకటేశ్వర్ 595 మార్కులతో జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్‌గా నిలిచాడు. మొత్తం 9577 మంది బాలురు, 10158 మంది బాలికలు ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ డివిజన్‌లో 1499 మంది బాలురు, 1210 మంది బాలికలు, థర్డ్ డివిజన్‌లో 610 మంది బాలురు, 389 మంది బాలికలు పాస్ అయ్యారు.