ఫోటోగ్రాఫర్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం

పులివెందులలోని నగరిగుట్ట చిన్నన్న రూముల్లో నివాసం ఉంటున్న ఫోటోగ్రాఫర్ బాబు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి వైయస్సార్ ఫొటో అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడు అల్లాబకాష్ రూ. 34 వేల నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. యూనియన్ లోని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేయాలని, సభ్యులకు ఆపద సంభవించినప్పుడు వారి కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని అల్లాబకాష్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్