మంగళవారం రాత్రి పుల్లంపేట మండలం పుల్లంగేరు బ్రిడ్జి వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో పుల్లంపేటకు చెందిన కొండపల్లి రాజా (45) అక్కడికక్కడే మృతి చెందారు. రాజంపేట నుండి సీతారాంపేటకు ఆటోలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనతో కడప-చెన్నై రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.