కుష్టు వ్యాధిపై అవగాహన: చిట్వేల్‌లో ప్రత్యేక కార్యక్రమం

మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని, అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో 30-01-2026 నుండి 13-02-2026 వరకు 'స్పర్శ' (కుష్టు) వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిట్వేల్ సర్పంచ్ దండు లక్ష్మి ఆధ్వర్యంలో ZPHS పాఠశాలలో HM దుర్గారాజు అధ్యక్షతన హెల్త్ సూపర్వైజర్ ఇస్మాయిల్ బాషా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. స్పర్శ లేని మచ్చలు కనిపిస్తే వెంటనే ఆశ కార్యకర్తకు తెలియజేసి PHCలో పరీక్షలు చేయించుకుంటే ఉచిత మందులతో పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLHP కల్పనా, ANM కృష్ణవేణి, ఆశలు పద్మ, కన్యాకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్