తుపాను బాధితులకు భోళా శంకర్ సేవా సమితి భోజన పంపిణీ

రైల్వే కోడూరులో దీత్వా తుపాను ప్రభావంతో ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పనులు లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు రైల్వే స్టేషన్ వద్ద భోళా శంకర్ సేవా సమితి సభ్యులు, అధ్యక్షుడు మండల నాగేంద్ర ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నం సెట్టి రమేష్, బుడిగి శివయ్య, సర్పంచ్ వాస బాబు, తన్నీరు ఆంజనేయులు,పెనుకొండ సుబ్బారాయుడు, ఓ. లక్ష్మయ్య, చెనంశెట్టి పురుషోత్తం, ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్