చిట్వేలీ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు బుధవారం ఎంపీపీ టంగుటూరి చంద్ర అధ్యక్షతన సర్వసభ్య బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని ముఖ్య అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవల విస్తరణ జరగాలన్నారు.