రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి బుధవారం పుల్లంపేట మండలంలోని పలు గ్రామాల్లో డోర్ టు డోర్ పర్యటన నిర్వహించారు. ప్రజల నుంచి త్రాగునీరు, విద్యుత్ సమస్యలు తెలుసుకుని వెంటనే అధికారులతో చర్చించారు. అభివృద్ధి పై దృష్టి సారించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.